స్పాట్ వాయిస్, గణపురం: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలైన ఘటన గణపురం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వరాజ్ పల్లి గ్రామానికి చెందిన చెరుకు తిరుపతిగౌడ్ శుక్రవారం రోజువారి పనిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు.
Recent Comments