రూ.23 వేల విలువైన డీజిల్ చోరీ
భూపాలపల్లి జాతీయ రహదారిపై ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డీజిల్ దొంగలు హల్‌చల్ చేశారు. డీజిల్ రేట్లు పెరగడంతో ఇది కూడా లాభసాటి భేరం అనుకున్నారో.. జల్సాలకు డబ్బుల కోసం దోచేద్దామనుకున్నారో కానీ.. డీజిల్ ట్యాంకులను పగులగొట్టి చమురు చోరీకి తెగబడ్డారు. ఈ ఘటన గణపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ 07 టీఎఫ్ 8169 నంబరు గల లారీ గురువారం రాత్రి గణపురం మండలం కర్కపల్లి గ్రామంలో 353 జాతీయ రహదారిపై నిలిపి ఉంచారు. గుర్తుతెలియని దొంగలు డీజిల్ ట్యాంకులను పగులగొట్టి డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ట్యాంకు 200 లీటర్ల సామర్థ్యం ఉండగా, మొత్తం 200 లీటర్ల డీజిల్ సుమారుగా రూ.23 వేల విలువ దొంగతనం జరిగింది. దీంతో బాధిత లారీ డ్రైవర్ నవీన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో డీజిల్ దొంగతనం జరుగడంతో వాహన యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Recent Comments