Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్గుడ్ న్యూస్..

గుడ్ న్యూస్..

పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు..
స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

స్పాట్ వాయిస్ , హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగాలు కొట్టాలనుకునే ఔత్సాహికులకు ఇది నిజంగా తీపి కబురే. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఎంతో చల్లని వార్తను అందించారు. డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం పొందలేకపోతామేమో అనే అనుమానంతో తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్న అభ్యర్థులకు రెండేళ్లు వయో పరిమితి పెంచుతూ సువర్ణ అవకాశాన్ని కల్పించారు. అసలే కరోనాతో రెండేళ్లుగా పోటీ పరీక్షలకు దూరమైన నిరుద్యోగులకు ఇది నిజంగా మంచి అవకాశం. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా 95 శాతం స్థానికత అమలులోకి రావడం, పోటీ పరీక్షలకు నిరుద్యోగులు దూరంగా ఉండడంతో తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలోనే సీఎం కేసీఆర్ కు విన్నించుకున్న విషయం తెలిసిందే. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ అందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments