స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్ కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక్కడ గతంలో ఎస్సైగా పని చేసిన ఉదయ్ కిరణ్ యువకుడిని చితకబాదడం, అతడి మరణానికి కారణమనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. సుమారు నెల రోజులుగా ఖాళీగా ఉన్న ఎస్సై సీటు.. ఇప్పుడు భర్తీ అయింది. భూపాలపల్లి టౌన్ ఎస్సైగా ఉన్న అభినవ్ కు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ గా మెప్పు పొందుతున్న తరుణంలో ఇక్కడ గతంలో పని చేసిన ఎస్సై తీరు వివాదాస్పదంగా మారింది. ఇక్కడి ప్రజలు పోలీసులంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ వైపు చూసేందుకు వణికిపోతున్నారు. ఈనేపథ్యంలో గణపురం ఎస్సైగా వచ్చిన అభినవ్ కు అనేక చాలెంజ్ లు, సమస్యలు ఆహ్వానం పలుకుతున్నాయి. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన అభిమాన్యుడిలా సమస్యలను ఛేదించి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మండల ప్రజల మనసు గెలుచుకుంటారో లేదో చూడాలి..
ఇవి సమస్యలు..
1) పీడీఎస్ రైసు దందా ఇక్కడ జోరుగా నడుస్తుంటుంది. దీన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
2) కలప, ఇసుకు అక్రమరవాణా ఇక్కడ సర్వ సాధారణం. దీనిపై ఎస్సై అభినవ్ ఎలా స్పందిస్తారోనని ప్రజలు వేచి చూస్తున్నారు.
3) గంజాయి దందా.. మండలంలో భారీగా దందా నడుస్తోంది. వందల మంది యువకులు ఈ మత్తుకు బానిసై.. బంగారు భవిష్యత్ ను కోల్పోతున్నారు. గంజాయి పీచమణిచేలా.. ఎస్సై ఎలాంటిచర్యలు తీసుకుంటారో చూడాలి.
4) ప్రధానంగా భూపాలపల్లిలో రాజకీయం వాడీవేడిగా ఉంటుంది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి. టీఆర్ఎస్ లోనే రెండు వర్గాలు ఉండగా.. కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి ఉన్నారు. వీరందరినీ సమన్వయం చేసుకుంటారా..? రాజకీయ ఆటుపోటులు ఎదుర్కొంటారా..? అని ప్రజలు వేచిచూస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ లోనే రెండు వర్గాలు ఉండడం ఎవరికి మంచిగా ఉన్నా.. మరొకరికి కోపం వచ్చే పరిస్థితులు ఎస్సైకి సవాల్ గా నిలువనున్నాయి.
5) మండల ప్రజలకు గతంలో పోలీసులంటే కలిగిన భయం, కోపాన్ని ఎస్సై అభినవ్ తొలిగించేందుకు ఎలా ముందుకెళ్తారోననదే సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతోంది.
అభినవ్.. అభిమానుడయ్యేనా..?
RELATED ARTICLES
Recent Comments