Sunday, April 6, 2025
Homeతెలంగాణకిడ్నీలో 206 రాళ్లు..

కిడ్నీలో 206 రాళ్లు..

గంట పాటు సర్జరీ..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 206 రాళ్లు.. అది ఒక కిడ్నీలో. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజం. కిడ్నీలో 206 రాళ్లు అంటే.. విన్నవారే కాదు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లు సైతం షాక్ అయ్యారు. న‌ల్లగొండ జిల్లాకు చెందిన వీర‌మ‌ళ్ల రామ‌కృష్ణయ్య(56)కు క‌డుపులో విపరీతంగా నొప్పి రావ‌డంతో హైద‌రాబాద్‌లోని అవేర్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ కు వెళ్లాడు. రామ‌కృష్ణయ్యకు వైద్యులు ప‌రీక్షలు నిర్వహించ‌గా, కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో బాధితుడికి గంట పాటు స‌ర్జరీ నిర్వహించి, 206 రాళ్లను తొల‌గించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments