Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలుజయశంకర్ జిల్లాలో స్తంభించిన ట్రాఫిక్

జయశంకర్ జిల్లాలో స్తంభించిన ట్రాఫిక్

పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలి

– చెల్పూర్ లో రవాణా రంగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

-353 జాతీయరహదారిపై స్తంభించిన ట్రాఫిక్

స్పాట్ వాయిస్, గణపురం: పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలని రవాణా రంగ జేఏసీ నాయకులు కోరారు. గురువారం రవాణా రంగ జేఏసీ ఆధ్వర్యంలో చెల్పూర్ లో 353 జాతీయ రహదారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెంచిన వాహన పన్నులకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ధరలు, బీమా ప్రీమియం, గీన్‌ ట్యాక్స్‌, పోలీసుల ‘ఈ చలానా’ లతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. గణపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేసి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులు దాసరి సంపత్, కొవ్వూరు శ్రీనివాస్, లక్కమ్ కుమార్, కొవ్వూరి మహేందర్, మట్టపురం మొగిలి, ఆటో అసోసియేషన్ నాయకులు దుగ్యాల సుధాకర్, జూగొండి దేవేందర్, గడ్డం ప్రసాద్, బీరెల్లి నరేష్, ఆరేపల్లి నరేష్, కోరే సదానందం, శీను, ఆకునూరి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments