బర్త్ డే వేడుక అంటూ వివాహం..
కేసు నమోదు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం వెలుగుచూసింది. పుట్టిన రోజు వేడుకని చెప్పి.. 12 ఏండ్ల బాలికను 35 ఏండ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని గ్రామస్తులకు చెప్పిన బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి.. బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ పాప అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరడంతో వారు పాపిరెడ్డిగూడకు చేరుకుని బాధితురాలిని చేరదీశారు. తనకు బర్త్ డే పేరిట పెళ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులకు, ఐసీడీఎస్ సిబ్బందికి వివరించింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
Recent Comments