రాష్ర్టంలో కురిసిన వాన
స్పాట్ వాయిస్, డెస్క్: రాష్ర్టంలో పలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంతో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. హన్మకొండ, భూపాపల్లి, ములుగు జిల్లాలో చినుకులు పడ్డాయి. జూన్ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గతంలోనే వెల్లడించింది. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని తెలిపింది.
అకాల వర్షంతో తడిసిన వడ్లు
RELATED ARTICLES
Recent Comments