Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్గులాబీలో చర్చ...: మార్నేని ఆడియో వైరల్..

గులాబీలో చర్చ…: మార్నేని ఆడియో వైరల్..

మార్నేనీ.. మాటల మర్మమేమి..?
అసలు అలా ఎందుకున్నారు..?
మంత్రి ఎర్రబెల్లిని పొగడడంపై సర్వత్రా చర్చ..
లోటు పూడ్చలేనిదనడంపై అసహనం..
అరూరికి చురకలంటించారా అనే విమర్శలు
కావాలనేనా..? కాకతాళీయంగానా..?
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేటలో ఎమ్మెల్యేగా దయన్న లేని లోటు కనిపిస్తోందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్న మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. శనివారం రాయపర్తిలో పీఏసీఎస్ గోదాముల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్నేని మాట్లాడారు. ఆయన సభలో మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు మార్నేని ఎందుకు అలా అన్నారంటూ గులాబీ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.
మర్మమేంటో..?
ఎందుకన్నా.. ఎందు కోసమో అనే ఉంటాడు. అంత మందిలో, అంతటి స్థాయి గల హోదాలో ఉండి మాట్లాడడం అంటే అంత ఆశామాషీ కాదు. అదీ వేరు పడిన నియోజకవర్గం.., మళ్లీ అవకాశమే ఉండని వైనం. అలాంటి ప్రాంతంలో ఆ ‘పాత’ మధురాలను వల్లెవేయడమంటే పైకి మాత్రం అప్పటి ఘనకీర్తిని మరోమారు గుర్తు చేసినట్టే అనిపించినా.., ‘ప్రస్తుతపు’ వారిని చిన్నబుచ్చిన విధానమే అనేది అంతర్గతంగా కనిపిస్తున్న విషయం. నొచ్చుకునే వారు నొచ్చుకున్నారు.., మెచ్చుకునే వారు మెచ్చుకున్నారు. కానీ, ఇదే విషయాన్ని అందరు మాత్రం చర్చకు పెట్టుకున్నారు. మొత్తంగా రాయపర్తిలో డీసీసీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాటల వెనక మర్మమేంటో అని పలువురు చర్చించుకుంటున్నారు.

 

ఎందుకనాల్సి వచ్చింది..
రాజుగారి రెండో భార్య చాలా మంచిదే.. అంటే సరిపోద్ది.. అందులో వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత అర్థాలు కనిపిస్తాయి. డీసీసీ చైర్మన్ మార్నేరి రవీందర్ రావు రాయపర్తి సభలో మాట్లాడిన తీరు కూడా అచ్చు అలాగే ఉందంటున్నారు అరూరి అభిమానులు. ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు వర్ధన్నపేట నుంచి హ్యాట్రిక్ కొట్టిన యోధుడే కావచ్చు., కానీ ప్రస్తుతం నియోజకవర్గం పరిస్థితి ఏంటి.., ఉన్న ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అంటున్నారు. ప్రజాసేవలో నిత్యం తలమునకలై, శక్తికి మించిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దూసుకెళ్తున్న అరూరి పనితనాన్ని గుర్తించకపోవడం ఆయనను చిన్నబుచ్చడమే అవుతుందంటున్నారు.

WhatsApp Audio 2022-05-14 at 4.06.20 PM

అభిమానం మంచిదే.. కానీ..,
డీసీసీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాటలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ అభిమానులు మాత్రం తీవ్రంగా నొచ్చుకుంటున్నారు. పదే పదే ఎర్రబెల్లి దయాకర్ రావు లేని లోటు అలాగే మిగిలిపోతోందని ఆయన మాట్లాడిన తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. అభిమానం ఉండడం మంచిదే గానీ, అది ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని అరూరి అభిమానులు బాహటంగానే విమర్శిస్తున్నారు. రెండు పర్యాయాలు బంపర్ మెజార్టీతో గెలిచిన అరూరి ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు, ఆయన చేసిన పనులే ఆయనకు రాష్ట్రంలోనే అఖండ మెజార్టీతో గెలిపించాయనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. పదేపదే ఎర్రబెల్లి లేని లోటు పూడ్చలేనిదని సభాముఖంగా ప్రస్తావించడంపై పెదవి విరుస్తున్నారు. మార్నేని వ్యవహారం చూస్తుంటే కావాలనే అన్నాడో.., కాకతాళీయంగా పలికాడోగానీ, అరూరి రమేష్ ను చిన్నబుచ్చినట్టే ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నిత్యం ప్రజల్లోనే, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిని చులకనగా మాట్లాడినట్టు అనిపిస్తోందని పలువురు నియోజకవర్గంలోని అరూరి అభిమానులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments