Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలురైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండ‌లం ఇల్లంద మార్కెట్‌లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు , రైతు బంధు సమితి మెంబర్స్, సర్పంచులు,ఎంపీటీసీలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments