ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటాం
– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: గణపురం మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివి ప్రసాద్ నాయుడి కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆయన ప్రథమ వర్ధంతికి వారు హాజరై ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహస్వామి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోట్ల నగేష్, సర్పంచులు దేవేందర్ గౌడ్, శశిరేఖ రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, మారగాని సరస్వతి శ్రీనివాస్, చెన్నూరి రమాదేవి మధుకర్, నాయకులు తిరుమలరావు, బత్తిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments