ఏఎమ్మార్ ఉద్యోగులను తొలగించాలి
స్పాట్ వాయిస్, మల్హర్: తాడిచెర్ల గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బొగుతవ్వకాల సంస్థ ఏఎమ్మార్ నియమించిన ఏ ఎన్ఎమ్ నిర్లక్ష్యం వల్ల 45 రోజుల బాబు అస్వస్థతకు గురయ్యాడని, ఈ సంఘటనకు ఏఎమ్మార్ కంపనీ నే బాధ్యత వహించాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎంపీపీ మాట్లాడుతూ.. మండల కేంద్రమైన తాడిచర్ల ఎస్సీ కాలనీ కి చెందిన ఇందారపు రేణుక మల్లేష్ దంపతులు శనివారం ఉదయం 10 గంటలకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఉన్న ఏఎమ్మార్ సిబ్బంది నిర్లక్ష్యంతో 16 నెలల పిల్లలకు వేయాల్సిన టీకాను 45 రోజుల బాబు కి వేశారన్నారు. దీంతో బాబు తీవ్ర అస్వస్థత కి గురయ్యాడన్నారు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. దీనికి పూర్తి బాధ్యత ఏఎమ్మార్ కంపెనీ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ అర్హత తో ఏఎమ్మార్ సంస్థ తాడిచెర్ల ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులను నియమిస్తుందోని , ఏఎమ్మార్ ఉద్యోగులపై ఎన్నో సార్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు కనీసం స్పందించ లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఏఎమ్మార్ ఉద్యోగులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తొలగించాలని, అదేవిధంగా బాధిత కుటుంబానికి ఏఎమ్మార్ సంస్థ ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఎంపీపీ హెచ్చరించారు.
ఏఎమ్మార్ ఉద్యోగులను తొలగించాలి
RELATED ARTICLES
Recent Comments