స్పాట్ వాయిస్, గణపురం: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలంలోని గాంధీనగర్, నగరంపల్లి, అప్పయపల్లి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్న వెంటనే పాలక వర్గం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో వారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, పాలక వర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
రైతులు అధైర్య పడొద్దు…
RELATED ARTICLES
Recent Comments