ఎనిమిది మందిపై కేసు
ఎక్సైజ్ సీఐ బీ.చంద్రమోహన్
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఐనవోలు గౌడ సంఘం అధ్యక్షుడు, సభ్యులు తమ సొసైటీ తాటి చెట్లను నరికి వేశారనే ఫిర్యాదు మేరకు ఖిలావరంగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు శనివారం ఘటనా స్థలానికి వెళ్లారు. కాటమయ్య గుడి దగ్గర గల 819 లోని పలు సబ్ నెంబర్లు గల సర్వే భూముల్లో చెట్లను పరిశీలించారు. అనంతరం స్థానికంగా విచారణ చేయగా మొత్తంగా 212 తాటి చెట్లను నరికి వేసినట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా తాటి చెట్లను నరికిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కేసు నమోదైన వారిలో బొల్లెపెల్లి మధు, బొల్లెపెల్లి ఎల్లయ్య, బొల్లెపెల్లి సంపత్, బొల్లెపెల్లి మహేష్, బొల్లెపెల్లి రమేష్, బొల్లెపెల్లి శ్రీధర్, బొల్లెపెల్లి రఘువర్మ, బొల్లెపెల్లి వెంకన్న ఉన్నారని, వారిపై ఎక్సైజ్ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ బీ.చంద్రమోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ఏ.సరిత, రేష్మాసుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments