స్పాట్ వాయిస్, కమలాపూర్: రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. మండల కేంద్రంలోని 10వ వార్డుకు చెందిన ప్రజలు కమలాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. 10వ వార్డులోని జీపీ రోడ్డును ఆక్రమించిన వారిపై 15 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన రోడ్డు స్థలాన్ని గత శనివారం అధికారులు పరిశీలించారు. కమలాపూర్ నుంచి పరకాల ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న జీపీ రోడ్డు సబితా ఫొటో స్టూడియో నుంచి ఎంపీడీవో ఆఫీస్ కు ఉండగా కొన్నేళ్ల క్రితం రాజకీయ పలుకుబడితో ఆ వార్డులోని మౌటం భిక్షపతి, మౌటం జంపయ్య ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారు. దీంతో వార్డు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు. జీపీ రోడ్డు 18 ఫీట్ల బాట వదిలిన తర్వాతనే భూమి కొనుకున్నారని అయిన అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేశారన్నారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ కాలనీకి బాటను పునరుద్ధరణ చేయాలని కోరారు.
Recent Comments