Sunday, November 24, 2024
Homeతెలంగాణబెట్టింగ్ లో వస్తే ఇస్తా.. లేదంటే చస్తా..

బెట్టింగ్ లో వస్తే ఇస్తా.. లేదంటే చస్తా..

బ్యాంక్ ఉద్యోగి చోరీ కేసులో ట్విస్ట్
స్పాట్ వాయిస్, డెస్క్: హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగి డబ్బుల చోరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. డబ్బులు తీసుకెళ్లిన క్యాషియర్.. మేనేజర్ కు ఓ మెసేజ్ చేశాడు. బెట్టింగ్ లో భారీగా నష్టపోయనని, ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బుతో బెట్టింగ్ పెట్టి.. తిరిగి వస్తే ఇస్తానని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు. రెండు రోజుల క్రితం బ్యాంకులో ఉన్న రూ.22 లక్షలతో క్యాషియర్ ప్రవీణ్ పరారైన విషయం తెలిసిందే. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. చోరీకి కారణం క్రికెట్ బెట్టింగేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments