టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు
రూ.100 కోట్ల విలువైన భూమి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం ప్రభుత్వం బంజారాహిల్స్ లో 4,935 చదరపు గజాల స్థలం కేటాయించింది. హైదరాబాద్ జిల్లా షేక్ పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పి, (టౌన్ సర్వే నెంబర్లు ఎల్ ఆర్ నెంబర్ 18/పి, టీఎస్ ఎల్ ఆర్ నెంబర్ 21/పి, బ్లాక్ – కే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఈ నెల 9వ తేదీన సీసీఎల్ఎకు ప్రతిపాదనలు పంపగా 10వ తేదీ న సీసీఎల్ అనమతి ఇచ్చింది.
Recent Comments