కేంద్ర మంత్రి ప్రశ్నకు సెక్రటరీ వివరణ..
బలమైన బ్రిడ్జి గాలికి కూలడమేంటని ఆశ్చర్యపోయిన అమాత్యుడు..
యంత్రాంగం పనితీరును బహిర్గతం చేస్తున్న ఘటన..
ఏమీ సెప్పతిరి ఐఏఎస్ గారని నెట్టింట్ట వైరల్..
స్పాట్ వాయిస్, డెస్క్: బ్రిడ్జెందుకు కూలింది అంటే.., గాలి దుమారానికి కూలింది అని మీరిచ్చుకున్న సమాధానం ఉంది చూడండి.. న భూతో.. న భవిష్యత్.. ఆహా.. ఏమీ సెలవిచ్చారు ఐఏఎస్ మహాశయా.. మీరు చదివిన చదువులేంటి.., వెలగబెడుతున్న కార్యాలేంటి. జనాలు ఎర్రి పుల్కలుగా కనిపిస్తున్నారా.. లేదంటే ఆ పూటకు మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన కేంద్ర మంత్రి గడ్కారీ గారు ఏమైనా అదోలా కనిపించారా. వేలాడే వంతెనల గురించి విన్నాం.. చూశాం కానీ, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గాలివాటానికి కూలిందంటే మైండ్ బ్లాంక్ కావాల్సిన విచిత్రం. అందునా అది మాములుగా కొద్దోగొప్పో డబ్బులతో జరుగుతున్న నిర్మాణం కాదయె. అక్షరాల రూ.1710 కోట్ల ఖర్చుతో నిర్మితం అవుతున్న బ్రిడ్జి. బిహార్ రాష్ట్రంలోని సుల్తాన్‌గంజ్, అగౌనీ ఘాట్ల మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి పనులు 2014 నుంచి నడుస్తున్నాయి. 3116 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి నిర్మాణ లోపం కారణంగా గత ఏప్రిల్ 29న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఏదో దాని వివరాలు కావాలని సదరు శాఖ మంత్రి గారు అడగడం ఏంటో.., దానికి సెక్రటరీ చావు కబురు సల్లగా చెప్పడం ఏంటో. ఆయన అడిగితే ఏదో పూర్తిగా నిజం చెప్పకపోయినా పర్లేదు కానీ పూర్తి అబద్ధాన్నే చెప్పి ఆశ్చర్యానికి గురిచేయడం ఆ ఐఏఎస్ కే చెల్లింది. దేశంలోనే అత్యున్నతమైన హోదా అయిన సివిల్ సర్వెంట్ ఇలాంటి సిల్లీ ఆన్సర్ చెప్పడం ఆయనకు ఎలా ఉందోగానీ, విన్న మంత్రి గారితో పాటు చదువుతున్న జనాలకు ఎక్కడో కెలికినట్టుగా అనిపించి ఉంటుంది.
హేమిటో.. గాలికి బ్రిడ్జి కూలడమేమిటో.., వివరణ అడిగితే ఐఏఎస్ గారు ఇలాంటి వివరణ ఇవ్వడం ఏమిటో.., అసలేందో ఇదంతా… సెక్రటరీనా మజాకా..?
Recent Comments