అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన
స్పాట్ వాయిస్, మల్హర్: మండలంలోని ఇప్పల పల్లి గ్రామ ఉపాధి కూలీలు మంగళవారం అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మేము మండుటెండల్లో ఉపాధి పనులను చేస్తుంటే పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ మీదికి రాకుండా, తవ్విన గుంతలను సరిగ్గా మెజర్మెంట్ తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని దీని ఫలితంగా చాలామందికి వారం రోజులు చేసిన పనికి కేవలం 250 రూపాయలు మాత్రమే అకౌంట్ లో పడుతున్నాయని ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉపాధి కూలీల నిరసన
RELATED ARTICLES
Recent Comments