Sunday, April 6, 2025
Homeతెలంగాణతల్లుల కోసం ఆర్టీసీ ఆఫర్

తల్లుల కోసం ఆర్టీసీ ఆఫర్

ఆదివారం జర్నీ ఫ్రీ
స్పాట్ వాయిస్, హన్మకొండ: టీఎస్ ఆర్టీసీ మరోసారి ఆఫర్ ప్రకటించింది. అంత‌ర్జా‌తీయ మాతృ‌ది‌నో‌త్సవం సంద‌ర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌక‌ర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నా‌రు‌లతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆది‌వారం ఉచి‌తంగా ప్రయా‌ణిం‌చవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్‌ ప్రక‌టించారు. అమ్మ అను‌రా‌గాన్ని, ప్రేమను వెల‌క‌ట్టలే‌మని, ఆ త్యాగ‌మూ‌ర్తుల విశిష్ట సేవ‌లను గుర్తుచేసు‌కుంటూ ఈ నిర్ణయం తీసు‌కు‌న్నా‌మని పేర్కొన్నారు. మదర్స్‌ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రత్యేక సమయాల్లో ఆర్టీసీ రాయితీలు క‌ల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా కూడా అవకాశాలు కల్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments