Monday, November 25, 2024
Homeక్రైమ్సినిమాకు వద్దంటే ఉరి వేసుకుంది..

సినిమాకు వద్దంటే ఉరి వేసుకుంది..

స్పాట్ వాయిస్, రంగారెడ్డి: భర్త సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం శంకర్ పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని భవానీ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన రాజు(22), స్వాతి(20) ప్రేమించుకొని మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. రాజు స్థానికంగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి సెకండ్‌ షో సినిమాకు తీసుకెళ్లాలని స్వాతి భర్తను కోరగా.. ఇప్పుడు వద్దన్నాడు. గురువారం తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగ్గా.. మనస్థాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. పక్కనున్న వారు వచ్చి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా స్వాతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వారు రాజుకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments