స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాడిలింగ్ సిస్టంలోని బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంపు మోటారు నుంచి అధికార నిర్లక్ష్యంతో పంప్ మోటర్ లో మంటలు చెలరేగాయి. హై టెంపరేచర్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కొద్ది రోజుల క్రితం జెన్కోలో ఫైర్ యాక్సిండెంట్ కాగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాద చాయలు తొలగకముందే మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.
స్పాట్ ఫ్లాష్…: కేటీపీపీలో మళ్లీ అగ్నిప్రమాదం..
RELATED ARTICLES
Recent Comments