Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్రాష్ర్టంలో రాహుల్ పర్యటన ఇలా..

రాష్ర్టంలో రాహుల్ పర్యటన ఇలా..

ఓయూలో ఎంట్రీ లేనట్టే..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 6న సాయంత్రం రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10కి ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలు దేరి… 5:45కు కాజీపేటలోని గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకుంటారు. 6:05గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 10:40కి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో బస చేయనున్నారు.
7వ తేదీ..
* మే 7వ తేదీ మధ్యాహ్నం 12:30కు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు.
* 12:50 నుంచి 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు.
*1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్‌ చేరుకుంటారు.
* 1:45 నుంచి 2:45 వరకు పార్టీ నాయకులతో సమావేశం అవుతారు.
* అనంతరం మెంబర్‌షిప్‌ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు.
* తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు.
* 5:50 కి ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు.
ఓయూకు నో
మే 7న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్​ నిర్ణయించింది. కానీ అందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ముఖాముఖికి అనుమతిచ్చేలా ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలన్న ఎన్‌ఎస్‌యూఐ నేతల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఓయూ ఉత్తర్వుల్లో జోక్యం చేసేందుకు నిరాకరించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments