ఫుల్ గా తాగిన లోకో పైలెట్..
గంటపాటు నిలిచిన ప్యాసింజర్ ట్రెయిన్
విచారణకు ఆదేశించిన డీఆర్ఎం
స్పాట్ వాయిస్, డెస్క్: ఎలాగూ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లే వరకు సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. నాలుకేమో ఇడ్సుకపోతోంది. బాడీలో అల్కహాల్ కంటెంట్ కూడా కొద్దికొద్దిగా తగ్గుతున్నట్టుగా అనిపించింది. ఏదైతే అది అయింది అనుకున్నాడో ఏమోగానీ, సదరు లోకో పైలట్ ఊరికే ఇంజిన్ లో కూర్చుకునే కంటే అలా వెళ్లి ఓ పెగ్గేసుకుని వస్తే పోలా.. అని స్టేషన్ సమీపంలోనే ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. ఒక్కో పెగ్గు ఒక్కో పెగ్గు అనుకుంటూ ‘ఫుల్’ గా లాగించేశాడు. కనీసంగా నిలబడలేని స్థితికి చేరుకున్నాడు. కాగా, రాజధానికి రైలు వెళ్లిపోగానే ఈ ప్యాసింజర్ ట్రైయిన్ కు సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చినా ఎంతకు కదలకపోవడంతో స్టేషన్ మాస్టర్ అనుమానంతో ఇంజిన్ లో చూశాడు. అసలు అందులో లోకో పైలట్ లేడనే విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి సదరు లోకో పైలెట్ ను అరెస్ట్ చేశారు. బిహార్ లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సహర్స వెళ్లే రైలును క్రాసింగ్ కోసం హసన్ పూర్ లో నిలిపివేశారు. ఇదే సరైన సమయం అని భావించిన లోకో పైలట్ కరణవీర్ యాదవ్ మందు కోసం బయటకు వెళ్లి స్పృహ లేకుండా తాగాడు. దీంతో సిగ్నల్ ఇచ్చినా రైలు గంట పాటు స్టేషన్ లోనే నిలిచిపోయింది. ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు.
ఓ పెగ్గేస్తే పోలా..
RELATED ARTICLES
Recent Comments