Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్'బండి' ఒక దద్దమ్మ..

‘బండి’ ఒక దద్దమ్మ..

బీజేపీ దద్దమ్మల పార్టీ
సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు…
అభివృద్ధి కనిపించడం లేదా..
ఉపాధి నిధులు ఆపింది ఎవరు..?
ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి
స్పాట్ వాయిస్, హన్మకొండ:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సిగ్గు ఉందా…అభివృద్ధి కనిపించడం లేదా.. జూట మాటల బంద్ చేయ్ అంటూ విరుచుకుపడ్డారు. హన్మకొండ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ జూటా మనిషి అని… బీజేపీ దద్దమ్మల పార్టీ అని మండిపడ్డారు. మూడు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడం లేదన్నది నిజమే… కానీ ఆ డబ్బులు ఇచ్చేదెవరూ…? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. నేరుగా ఉపాధి కూలీల డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడతుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపుతుందని నిలదీశారు. ఉపాధి హామీ పనుల నిధులపై చర్చకు సిద్ధమా..? అంటూ మంత్రి సవాల్ విసిరారు. కేంద్రంలో అధికారం ఉన్నా.. బండి ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేదని విమర్శించారు. అభివృద్ధి లో తెలంగాణ నంబర్ వన్ అంటూ కేంద్ర మే సర్టిఫికెట్ ఇస్తోందని, మళ్లీ బండి సంజయ్ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై బండి సంజయ్‌కు అవగాహన లేదన్నారు. ఉపాధి పని దినాలు, కూలీల వసతుల కోత పెట్టింది కేంద్రం కాదా అన్ని ప్రశ్నించారు. పెట్రో , గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని రాద్దాంతం చేస్తోందన్నారు. పెట్రో ధరలు పెరిగితే చార్జీలు పెరగవా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా జూటా మాటలు బంద్ చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments