Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలురంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక 3వ వార్డు పరిధిలోని బాంబులగడ్డలోని ఈద్గాలో మంగళవారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… రంజాన్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, గత రెండు సంవత్సరాలుగా కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడిప్పుడే కరోనా దూరం అయిపోయి అందరం ఆరోగ్యంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు నెలవని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నో కోరికలతో ఉపవాస దీక్షలు చేసి నేటితో ముగుస్తున్న సందర్భంగా ఆ అల్లా దయతో మీరు కోరుకున్న కోరికలు తీర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థించినట్లు చెప్పారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments