స్పాట్ వాయిస్, దామెర: ఎంజీఎం లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. దామెర ఎస్సై హరిప్రియ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో గత నెల 10 వ తేదీన పెట్రోల్ బంకు వద్ద రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సుమారు 65 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వివరాలు అడుగగా.. పేరు భారతి అని చెప్పిందని, మరిన్ని వివరాలు అడగటానికి ప్రయత్నించగా మతి స్థిమితం లేని విధంగా ప్రవర్తించిందని ఎస్సై చెప్పారు. ఆమెను 108 లో ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రియ తెలిపారు. కాగా మృతి చెందిన మహిళ చామన ఛాయ, గుండ్రని మొహం కలిగి ఉందని, ఎరుపు రంగుపై పూలు కలిగి ఉన్న చీర, బ్లూ కలర్ జాకెట్ ను ధరించి ఉందని తెలిపారు. ఈ మహిళ కు సంబంధించిన వారు దామెర పోలీస్ స్టేషన్ నంబర్ 9440904691 లో సంప్రదించాలని ఎస్సై హరిప్రియ కోరారు.
Recent Comments