టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్
స్పాట్ వాయిస్, గణపురం: ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ అన్నారు. గణపురం ఎస్సై కొట్టాడని మనస్తాపంతో టీఆర్ఎస్ కార్యకర్త పెండ్యాల ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం జరిగిన ప్రశాంత్ దశదినకర్మలో సిరికొండ ప్రశాంత్ పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రశాంత్ కుటుంబానికి సిరికొండ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా మండల కేంద్రంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జంగిలి గోవిందరావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు బైరగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మార్క సమ్మయ్య, కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, చాంద్ పాషా, తంగళ్ళపల్లి వెంకట్, జంగిలి శ్రీనివాసరావు, మామిడి నరసింహ స్వామి, కట్ల శంకరయ్య, కొవ్వూరి శ్రీనివాస్, ల్యాదల్ల శంకర్, పాసికంటి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటాం..
RELATED ARTICLES
Recent Comments