వినతిపత్రం ఇస్తే చేయమన్నారు కదా..!
కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదా..
సింగరేణి అధికారుల తీరుపై మండిపడిన యాదవ కాలనీ వాసులు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: సింగరేణి కార్మికుల ప్రాణాలంటే అంత అలుసా..? వద్దనా పనులు ఎలా చేస్తారు.. వినతిపత్రం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పి.. ఇంత మోసం చేస్తారా అంటూ భూపాలపల్లి పట్టణంలోని యాదవ కాలనీ వాసులు మండిపడ్డారు. వారం రోజుల క్రితం ఇళ్ల మధ్య జియో టవర్ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో భూపాలపల్లి కారల్ మార్క్స్ కాలనీలో టవర్ వలన ఇద్దరు చనిపోయిన పరిస్థితులను ఉదహరిస్తూ.. టవర్ పనులు నిలిపివేయాలని సింగరేణి పర్సనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. అప్పుడు సానుకూలంగా స్పందించిన అధికారులు వినతిపత్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా సోమవారం పెద్ద ఎత్తులో సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది సాయంతో జేసీబీతో పనులు మొదలు పెట్టారు. దీంతో స్థానికులు మళ్లీ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సింగరేణి కోసం ప్రాణాలను పక్కన పెట్టి పనిచేస్తుంటే మా ప్రాణాలను లెక్కచేయకుండా సింగరేణి యాజమాన్యం ఇళ్ల మధ్యలో టవర్ నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టవర్ నిర్మాణాన్ని వేరే చోటుకు మార్చాలను కోరారు. పనులు అడ్డుకున్న వారిలో సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీన్ కుమార్, జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, సర్ధార్, పీరయ్య, రఫీ, ఖలీల్, తాజుద్దీన్, సరోజన, శారద, జయ, ఖతిజ తదితరులు పాల్గొన్నారు.
వద్దన్నా.. పనులు చేస్తారా..?
RELATED ARTICLES
Recent Comments