Monday, April 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్చిట్టీ వ్యాపారీ టోకరా

చిట్టీ వ్యాపారీ టోకరా

చిట్టీ వ్యాపారీ టోకరా..
సభ్యులందరికీ ఐపీ నోటీసులు
లబోదిబోమంటున్న బాధితులు

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్‌ లేబర్‌ కాలనీ టీఆర్‌టీ కాలనీలో చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ.40 కోట్లకు ఐపీ పెట్టాడు. దీంతో సభ్యులంతా లబోదిబోమంటున్నారు. దశాబ్ధకాలంగా  మూడెడ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చిట్టీలను నిర్వహిస్తున్నాడు. కల్పవల్లి అసోసియేట్స్‌ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు.  అతడిపై నమ్మకం కుదరడంతో ఈప్రాంతంలోని సుమారు 900 మంది ఆయన వద్ద చిట్టిలు వేశారు. చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండడంతో పలువురు వడ్డీ ఆశతో లక్షల రూపాయలు అతడికి అప్పుగా ఇచ్చారు.  కొద్ది కాలంగా చిట్టీలు ఎత్తుకున్న వారికి, డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడం ఆలస్యం కావడంతో బాధితులు ఆయన ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల డబ్బుల కోసం నిలదీయడంతో కంపెనీ లాస్‌లో ఉందంటూ దాటవేశాడు. ఆందోళన చెందిన సభ్యులు అతడి ఇంటికి వెళ్లారు. సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల క్రితం దేవుని దర్శనానికి వెళుతున్నట్లు చెప్పి ఉడాయించాడు. అయితే అతడు సభ్యులందరికీ ఐపీ నోటీసులు పంపడంతో బాధితులంతా అవాక్కయ్యారు. ఈ విషయం దావనంల ప్రచారం కావడంతో సోమవారం బాధితులు అతడి ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి బాధితులను శాంతిపజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments