Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుకార్మికులకు అండగా ఉంటాం...

కార్మికులకు అండగా ఉంటాం…

మేడే వేడుకల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
స్పాట్ వాయిస్, వరంగల్: కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హామీ ఇచ్చారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా నగరంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం, అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలోని కూరగాయల మార్కెట్ హమాలీ యూనియన్ ,పండ్ల మార్కెట్ హమాలీ యూనియన్ , సామిల్ వర్కర్స్, హమాలీ యూనియన్ ఖమ్మం రోడ్డు, హెడ్ ఫోస్టాఫీస్ సేంటర్, పోచమ్మ మైదాన్ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పోతన నగర్ డంపింగ్ యార్డ్ స్వచ్ఛ భారత్ అటో డ్రైవర్స్, ఎంజీఎం మెడికల్ &హెల్త్ యూనియన్ తదితర రంగాల మేడే వేడుకలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు అండగా కార్మిక సంక్షేమ బోర్డ్ కార్మికులు మృతి చెందితే ఎక్సిగ్రేషియా అందేలా చూస్తుందన్నారు. బిల్డింగ్ కార్మికులకు బోర్డ్ ద్వారా అనేక విధాలుగా లబ్ధి జరుగుతుందని చెప్పారు. అలాగే దేశంలో ఏ ప్రభుత్వం చేయని పని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు సైతం 30% పీఆర్సీ పెంచిన ఘనత కేసిఆర్ దేనని చెప్పారు. కార్మిక వ్యతిరేకిగా మారిన బిజేపి పై పోరాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు బోగి సురేష్ , మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి-కుమారస్వామి, కార్పొరేటర్ సోమిశేట్టి ప్రవీణ్ , మర్రి శ్రీనివాస్, జారతి రమేష్, జారతి శ్రీనివాస్ ,వివిధ సంఘాల నాయకులు గట్టికొప్పుల సాంబయ్య, వెంకన్న, సారయ్య, కుమార్ ,రాజయ్య, గాదే కుమార్, కొత్తకొండ శ్రీనివాస్ ,మైదం నరేష్, రాంమూర్తి, భిక్షపతి, అనిల్,జీవన్ ,కోమల,ఆదామ్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments