స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా హసన్ పర్తి ఎర్రగట్టుగుట్ట వద్ద ఉన్న బాలాజీ గార్డెన్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్ అని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కానుకలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సంరద్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుపేద ముస్లింలకు బట్టల పంపిణీ చేశారు.
Recent Comments