Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుకార్మికుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

కార్మికుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: కార్మిక, కర్షకుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో యువ చైతన్య యూత్ ఆటో యూనియన్, కామారెడ్డి గూడెంలో హమాలీ సంఘం, పాలకుర్తి లో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే జెండాలు మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్మికశాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేసిందని, దీని ద్వారా కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభిస్తున్నదని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments