బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు చిట్టూరి రాజు ఆధ్వర్యంలో బీజేపీ బూత్ లెవెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎలక్షన్ లో బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలంగా నిలుస్తారని చెప్పారు. శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చీటూరు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి పెళ్లి రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షుడు కొండేటి సత్యం, మోర్చా అధ్యక్షుడు బోయినపల్లి దేవేందర్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలే పార్టీకి బలం
RELATED ARTICLES
Recent Comments