నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆయన నివాసంలో దామెర మండల కేంద్రం, ఊరుగొండ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వేల్పుల బాబుకు రూ.3,00,000 , బి.నీలమ్మ రూ.2,00,000 ఎల్ ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బిల్లా రమణా రెడ్డి, మండల దళిత బంధు చైర్మన్ గరిగె కృష్ణమూర్తి,నాయకులు ప్రసాద్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్
RELATED ARTICLES
Recent Comments