Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుకేటీపీపీ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో మే డే

కేటీపీపీ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో మే డే

కేటీపీపీ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో మే డే

స్పాట్ వాయిస్, గణపురం: టీఎస్ఈఈయూ- 327 (ఐఎన్టీయూసీ) జెన్కో కంపెనీ రాష్ట్ర అధ్యక్షుడు పిన్నింటి మాధవరావు ఆదివారం మే డే పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేకమంది అమరవీరుల ప్రాణాల బలిదానంతో పనిగంటలు సాధించుకున్న దినం మే డే అని అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను నేడు బీజేపీ హరిస్తుందని అన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉద్యమించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కట్ల సదయ్య, రీజనల్ సెక్రటరీ సముద్రాల రాజు, మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్, ఇంద్ర రెడ్డి, వేణు, మనోహర్, మాధవరావు, వేణు, శ్రీనివాసులు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments