శ్రమదోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించాలి
-అమరవీరుల రక్తం తోటే పుట్టింది ఎర్రజెండా.
-సీపీఎం మండల కమిటీ సభ్యులు, ముల్కలగూడెం సర్పంచ్ బండి పర్వతాలు
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: అమర వీరుల స్ఫూర్తితో శ్రమదోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించాలని సీపీఎం మండల కమిటీసభ్యులు, ముల్కలగూడెమ్ సర్పంచ్ బండి పర్వతాలు రైతులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. ఐనవోలు మండలం లోని ముల్కలగూడెం గ్రామంలో ఆదివారం సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ లీడర్ కందుగుల చాందయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం ఐనవోలు మండలం కమిటీ సభ్యులు, ముల్కలగూడెమ్ సర్పంచ్ బండి పర్వతాలు హాజరై మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా దేశం చికాగో నగరంలో రోజుకు 15,20 గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తుంటే ఆనాడున్న పాలకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపితే ఎందరో అమరవీరులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమరవీరుల రక్తం తోటే ఆనాడు పుట్టిందే ఎర్రజెండా అని అప్పటి నుంచి 8 గంటల పని దినాలు తీసుకు వచ్చిన చరిత్ర మే ఒకటికి ఉందన్నారు. అప్పటినుండి మే 1 తేదీన కార్మిక దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని, కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తు రోజుకు 8 గంటల నుంచి 12,14 గంటలు పని చేయించుకుంటున్నారన్నారు. పోరాటాలతో కార్మికులు హక్కులు సాధించుకుంటే వాటిని అమలు పరచకుండా కొత్త చట్టాలను తీసుకువచ్చి కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తీసుకువచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి మహేందర్ కమిటీ సభ్యులు గోపాల్ రావు,చిన్న మహేందర్, గిరుక వెంకన్న, జక్కుల గోపి, బైకని సంపత్, బైకని అనిల్, బైరి రజిత, ఆలేటి ఉపేంద్ర, నజీమా, స్వరూప, కార్మికులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
శ్రమదోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించాలి
RELATED ARTICLES
Recent Comments