అటవీ గ్రామాల్లో.. మావోయిస్టు కరపత్రాల కలకలం
స్పాట్ వాయిస్, మహా ముత్తారం: మండలం లోని పెగడపల్లి, కనకునుర్ గ్రామాల్లో ఆదివారం ఉదయం మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. గ్రామాల్లోని ప్రధాన కుడళ్లు, రోడ్ల పై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), జయశంకర్ భూపాల పల్లి, వరంగల్ 2, పెద్దపల్లి, (జేయం డబ్ల్యూసీ ) డివిజన్ కమిటీ పేరిట కరపత్రాలు దర్శనమిచ్చాయి. ’50 ఆకుల తునికాకు కట్టకు రూ 3 చెల్లించాలని కరపత్రం లో ముద్రించి ఉంది. షెడ్యూల్డ్ 5, 6, పేసా చట్టాల ప్రకారం ఏజెన్సీ లో ఆదివాసులు పుర్తి హక్కులు కలిగి ఉంటారని, ఆదివాసీ సొసైటీ ల ద్వారా తునికాకు సేకరించి, రేట్లు నిర్ణయించి అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి ఖర్చు చేసే అధికారం ఆదివాసీ సొసైటీలకు ఉంటుంది. కానీ ప్రభుత్వం టెండర్లు నిర్వహించి హక్కులను కాలరాస్తుందని కరపత్రం లో ముద్రించి ఉంది. ఎండాకాలం లో తీవ్ర ఇబ్బందులు పడి తునికాకు సేకరించే కూలీల శ్రమ దోపిడీ చేస్తూ, కాంట్రాక్టలు కిలో ఆకు కు రూ. 300 విక్రయిస్తున్నారని, 50 ఆకుల కట్ట కు 3 రూపాయలు వెచ్చించాలన్నారు. ప్రజలు ఉద్యమం చేయాలని కరపత్రం లో ముద్రించి ఉంది.’ కరపత్రాలు దర్శనం ఇవ్వడం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Recent Comments