స్పాట్ వాయిస్, హన్మకొండ: నిరుద్యోగులకు టీఎస్ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లపై 20శాతం తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు ఈ పాస్‌లను కొనసాగిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకునే యువతీయువకులు ఆధార్ కార్డ్ జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీకార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అందజేయాలని ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్‌లకు రూ.3,450లు వసూలు చేస్తున్నారు. 20 శాతం తగ్గించగా.. రూ.2,800లు అవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు రూ.3,890 అవుతుండగా… 20 శాతం తగ్గిస్తే రూ.3,200లు అవుతుందని ఆర్టీసీ వెల్లడించింది.
Recent Comments