Monday, June 9, 2025
Homeక్రైమ్భర్త చనిపోయిన 10 నిమిషాలకే భార్య మృతి

భర్త చనిపోయిన 10 నిమిషాలకే భార్య మృతి

సంగెం మండలంలో విషాదం
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చావులోనూ ఆ భార్యాభర్తల బంధం వీడలేదు. భర్త చనిపోయాడని తెలిసిన 10 నిమిషాలకే భార్య సైతం మరణించింది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూర కట్టయ్య (75 ) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కమలమ్మ (65) గుండెపోటుతో కుప్పకూలిపోయింది. మృతి చెందిన వృద్ధ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments