మట్టి తరలింపునకు వచ్చిన లారీల అడ్డగింత
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించేందుకు వచ్చిన లారీలను వర్ధన్నపేట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ చిటూరు రాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పట్టుకున్నారు. డ్రైవర్లతో మాట్లాడగా కాంట్రాక్టర్ పంపాడని, మట్టి తీసుకెళ్తామని చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. 8 లారీలను అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు సైతం మట్టి తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల్లో మట్టి తరలకుండా అడ్డుకున్నారు.
Recent Comments