Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్జూన్ రెండోవారంలో ఫోర్త్ వేవ్..!

జూన్ రెండోవారంలో ఫోర్త్ వేవ్..!

అంచనా వేస్తున్న వైద్యశాఖ
ప్రస్తుతం రాష్ర్టంలో రోజు 40 కరోనా కేసులు
చుట్టుపక్కల రాష్ర్టాల్లో విజృంభిస్తున్న కొవిడ్
స్పాట్ వాయిస్, డెస్క్: రాష్ట్రంలో వచ్చే జూన్‌ రెండోవారం నాటికి కొవిడ్‌ ఉద్ధృతి పెరగొచ్చని వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరంలో రోజుకు సుమారు 40 వరకూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 21 పాజిటివ్‌లు హైదరాబాద్‌లో నిర్ధారణ అయ్యాయి. దీనికి తోడు ఢిల్లీ, మహారాష్ర్టతో పాటు చుట్టు ఉన్న రాష్ర్టాల్లోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలోనూ కొద్దిమేర కేసులు పెరుగుతున్నట్లు వైద్య శాఖ పేర్కొంది. అయితే వీటి సంఖ్య జూన్‌ రెండోవారం నాటికి మూడంకెల సంఖ్యను దాటే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఫోర్త్ వేవ్ త్వరలోనే ముంచుకొస్తుందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నా.. వచ్చే ఛాన్స్ స్వల్పమనని పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు విస్మరించొద్దని, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించాలని వైద్యశాఖ సూచించింది. ఇప్పటివరకూ టీకాలు పొందని వారు ముందుకొచ్చి టీకాలు వేయించుకోవాలని వైద్య శాఖ, ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 40 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 పాజిటివ్‌లు హైదరాబాద్‌లో నిర్ధారణ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments