పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్ ది
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
స్పాట్ వాయిస్, కాజీపేట: అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం సాయంత్రం కాజీపేట జామా మసీదు లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కేసీఆర్ రంజాన్ కానుకలు అందిస్తున్నారన్నారు. ముస్లింల ఉన్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరుఫున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏడు చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
అన్ని మతాలకు పెద్దపీట
RELATED ARTICLES
Recent Comments