Thursday, April 17, 2025
Homeక్రైమ్తెల్లవారితే నిశ్చితార్థం..

తెల్లవారితే నిశ్చితార్థం..

తెల్లవారితే నిశ్చితార్థం..
అర్ధరాత్రి దొంగల చేతివాటం..
మానుకోట జిల్లా గూడురులో ఘటన
లబోదిబోమంటున్న యువతి కుటుంబం
స్పాట్ వాయిస్, గూడూరు: తెల్లవారితే నిశ్చితార్థం.. అర్ధరాత్రి దొంగల చేతివాటం. ఉదయాన్నే లబోదిబోమని ఏడుపులు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాషబోయిన ఐలయ్య కూతురికి సూర్యపేటకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో గురువారం కూతురు నిశ్చితార్థం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. పనులన్నీ ముగించుకుని ఎక్కడివారు అక్కడ నిద్రకు ఉపక్రమించారు. నిశ్చితార్థం జరిగే ఇల్లు కదా.. అని రాత్రి గడియ వేయకుండా ఆరు బయట కొందరు, ఇంట్లో మరికొందరు పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు చేతివాటాన్ని ప్రదర్శంచారు. ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లారు. తాంబూలాలకి సిద్ధంగా ఇంట్లో ఉంచిన రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారు నగలు పెట్టిన సూట్ కేసును ఎత్తుకెళ్లారు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments