మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు
మానుకోట జిల్లాలో ఉదంతం
స్పాట్ వాయిస్, దంతాలపల్లి: భావితరాలకు జ్ఞానాన్ని నింపాల్సిన ఉపాధ్యాయుడు వారి జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు మహేందర్ పదోతరగతి విద్యార్థినులతో కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికన్న ఈ విషయం చెబితే మీ పని చేస్తా అంటూ బ్లాక్‌మొయిల్ కు దిగాడు. చేతుల మీద కొట్టడంతో పాటు లైంగికంగా వేధించాడు. అయితే ఈ విషయాన్ని ఓ విద్యార్థిని తమ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు మహేందర్‌ను చితకబాదారు. అనంతరం అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడి స్వగ్రామం పర్వతగిరి మండలం కొండాపురం కాగా.. దాట్ల గ్రామంలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
Recent Comments