బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి
స్పాట్ వాయిస్, రేగొండ: భూపాలపల్లిలో సోమవారం జరగనున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగారపు కిషన్ రెడ్డి సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి కోరారు. ఆదివారం రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం భూపాలపల్లి జిల్లాను ఎంపిక చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రమంత్రి భూపాలపల్లికి వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో సభను ఏర్పాటు చేశామని, ప్రజలు, బీజేపీ నాయకులు భారీగా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొలసాని తిరుపతిరావు, బీజేపీ నాయకులు బండి శ్రీను, ఏడేల్లి వెంకట్ రెడ్డి, గణేష్, మల్లేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి సభకు భారీగా తరలిరావాలి
RELATED ARTICLES
Recent Comments