స్పాట్ వాయిస్ ఖానాపూర్ : ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుకలను బుధరావుపేటలోని జామా మసీద్ లో మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మహిళలకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ సుభాన్ బి మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు పండగ సందర్భంగా కానుకలు అందించడం సంతోషకరమన్నారు. అదేవిధంగా ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదగాని రమ -మురళి, వార్డు సభ్యులు చందుపాష, యాకుబ్ పాషా, మాజీ ఎంపీటీసీ సైదాబి లాల్ సాబ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments