ప్రశాంత్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే గండ్ర నివాళి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ ఇటీవల బైకు షోరూం యాజమాన్యంతో ఎన్ఓసి విషయంలో వాగ్వాదం జరుగగా పోలీసుల జోక్యంతో మనస్థాపనికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకరమణారెడ్డి ఆదివారం ప్రశాంత్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గణపురం మండల పీఎసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొలుసాని లక్ష్మి నరసింహరావు, భూపాలపల్లి పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుటుంబానికి అండగా ఉంటా..
RELATED ARTICLES
Recent Comments