Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలుమృతుడి కుటుంబానికి సిరికొండ సాయం

మృతుడి కుటుంబానికి సిరికొండ సాయం

మృతదేహం వద్ద నివాళి అర్పించిన యువనేత
రూ.50వేల సాయం ప్రకటించి ప్రశాంత్

తక్షణ సాయం గా రూ.25 వేలు అందజేత
స్పాట్ వాయిస్, గణపురం: పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి సిరికొండ ప్రశాంత్ అండగా నిలిచారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులను పరామర్శించిన సిరికొండ రూ.50 వేల సాయాన్ని ప్రకటించారు. అలాగే తక్షణ సాయంగా రూ.25వేలు అందజేశారు. అనంతరం మట్లాడుతూ..పార్టీ తరుఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి తోడుగా
మండల కేంద్రానికి చెందిన యువకుడు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న సి‌రికొండ ప్రశాంత్ శనివారం గణపురం చేరుకున్నారు. 500 మంది యువకులు వెంట తరలివచ్చారు. అయితే పోలీసులు ఆందోళనలు జరుగుతాయనే ఉద్ధేశంతో.. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలోనే ఉంచారు. దీంతో సిరికొండ ప్రశాంత్ సైతం రాత్రి స్థానికంగానే ఉన్నారు. ఆదివారం ఉదయం మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments