అర్థరాత్రి హత్య..
భార్యను చంపిన భర్త
మానుకోట జిల్లాలో కలకలం..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాద్ జిల్లాలో శనివారం అర్థరాత్రి హత్య జరిగింది.. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ లో కౌన్సిలర్ హత్యా ఘటన మరువక ముందే గూడూరు మండలంలో భార్యను భర్త చంపేశాడు.. స్థానికుల కథనం ప్రకారం… గూడూరు మండలం ఏపూరు గ్రామ శివారు కోడిపుంజుల తండాకి చెందిన బానోతు బిక్కి(40) ని భర్త కోటియా శనివారం అర్థరాత్రి హత్య చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఘటనా వివరాలు సేకరిస్తున్నారు.. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.. పరారీలో ఉన్న భర్త కోటియా ను గూడూరు పోలీసులు కొన్ని గంటల్లోనే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అయితే కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని..ఈ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments